16న ప్రధాని మోడీ పర్యటన

16న ప్రధాని మోడీ పర్యటన

  • సభకు మూడు లక్షల మంది
  • పదివేల బస్సుల కు పార్కింగ్ సౌకర్యం
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి


కర్నూలు, ప్రతినిధి, అక్టోబర్ 10 (ఆంధ్రప్రభ) : ఈనెల 16న జరిగే ప్రధానమంత్రి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.సిరి (Collector A.Siri) పేర్కొన్నారు. శుక్రవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ… ఈనెల 16న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా ఓర్వకల్ ఏర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి శ్రీశైలం వెళ్లి దర్శనానంతరం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగ మయూరి వెంచర్ లో ఏర్పాటు చేసిన” సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ” బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

ఈ బహిరంగ సభ (Public Meeting) 40 ఎకరములలో మూడు లక్షల మంది సమావేశంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసామన్నారు. 347 ఎకరాలలో 10వేల బస్సుల పార్కింగ్ కు ఏర్పాట్లు, 12 పార్కింగ్ పాయింట్లు సిద్ధం చేశామన్నారు. అన్ని పార్కింగ్ పాయింట్లు (Parking points) జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా అంతర్గత రహదారుల పనులు సాయంకాలానికి పూర్తవుతాయన్నారు. పబ్లిక్ మీటింగ్ కు వచ్చిన ప్రజలందరికీ 15 లక్షల లీటర్ల త్రాగునీరు, మజ్జిగ, భోజనంతో పాటు అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేశామన్నారు.

Leave a Reply