వరద ఉద్ధృతిని పరిశీలించిన పోలీసులు

టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బోర్నపల్లి వాగు వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సై అమూల్య ఆదేశాల మేరకు కానిస్టేబుల్ మహేందర్ గురువారం పరిస్థితులను పరిశీలించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం పెరగడంతో రహదారి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని అంచనా వేశారు.

వరద ఉద్ధృతి కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.