AP | డబ్బుల వివాదంతో భర్త ఆత్మహత్యాయత్నం…

AP | రాజుపాలెం, జులై 30, (ఆంధ్రప్రభ ): భార్య తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదని మనస్థాపనతో భర్త గొంతు కోసుకున్న సంఘటన మండలంలోని ఆకుల గడపవరం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుంభ సాంబయ్య కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు.. ఇతనికి సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది.

వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం. సాంబయ్య మద్యానికి బానిసై తన భార్య నాగలక్ష్మిని శారీరకంగా మానసికంగా హింసిస్తుండడంతో ఆమె సంవత్సరం క్రితం తన కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిందని, అప్పటినుండి సాంబయ్య తన ఇరువురి కుమారులతో తల్లిదండ్రుల వద్ద ఉన్నారు.

అయితే ఈనెలలె తల్లికి వందనం డబ్బులు భార్య నాగలక్ష్మి ఎకౌంట్లో పడ్డాయి.. సదరు డబ్బులు తనకు ఇవ్వమని సాంబయ్య నాగలక్ష్మికి ఫోన్ చేయగా.. అందుకు నాగలక్ష్మి.. నీకు ఇస్తే తాగి పాడు చేస్తావు.. నేను మామయ్య అకౌంట్ కి డబ్బులు వేస్తాను అని చెప్పడంతో బుధవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో తన తండ్రితో నీకు డబ్బులు ఎందుకు.. నా అకౌంట్ కు పంపించమని గొడవపడి మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు చికిత్స నిమిత్తం సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.