స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలోభాగస్వాములు కావాలి..
- ప్రభుత్వ విప్,సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన స్వచ్ఛ గాలి, వెలుతురు సక్రమంగా ఇంటికి వస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.స్థానిక 64వ డివిజన్ బివి సుబ్బారెడ్డి హై స్కూల్ నందు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపించి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు పరిశుభ్రమైన పరిసరాలు అత్యంత అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నివాస ప్రాంతాల పరిశుభ్రత కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ, విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా అవసరమైన అన్ని వనరులు, డంపర్ బిన్లు, వాహనాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఉంచిన మలేరియా, చెత్త సేకరణ స్టాల్స్ ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో స్థానిక64వ డివిజన్ టీడీపి అధ్యక్షుడు కాకొల్లు రవి కుమార్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శకుంతల, సర్కిల్ 2 జోనల్ కమిషనర్ ప్రభుదాస్,సీడీఓ జగదీశ్వరి, ఏఈ అహ్మద్, మెడికల్ ఆఫీసర్ హర్షిత, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు,కంకణాల బాబు, భానుమతి,భాగ్యలక్ష్మి, స్కూల్ ప్రిన్సిపల్ జయరాజు తదితరులు పాల్గొన్నారు.
