ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని సీనియర్ నాయకులు, అఖిలపక్ష కమిటీ సభ్యులు నమిలే అంజిబాబు శుక్రవారం కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా ఇంతవరకు రెవెన్యూ డివిజన్ ప్రకటన రాకపోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైన మనోవేదన ఉందని ఆయన తెలిపారు. 1952 నుండి నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆలేరు పాత తాలూకా కేంద్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి, మలిదశల్లో కీలక పాత్ర నిర్వహించిన కేంద్రమని ఆయన గుర్తు చేశారు. డివిజన్ కాదగిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆలస్యం జరగడం బాధాకరమని ఆయన చెప్పారు. ప్రజల చిరకాల కోరిక అయిన డివిజన్ ను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
