కనకదుర్గమ్మ కు ఆషాడ మాస విశేష పూజలు

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుండే తరలివచ్చి విశేషాలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.