Murshidabad | ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి..

Murshidabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ జిల్లాలో విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైల్వే గేట్ తెరిచి ఉండటంతో స్కూల్ వ్యాన్ రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జవగా, ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే గేట్ ఎందుకు తెరిచి ఉందన్న అంశంపై కూడా విచారణ జరుపుతున్నారు.