అభివృద్ధి కోసం నిధులిస్తే…జీతాలకు మళ్లిస్తారా
…కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆర్ధిక సంఘం నిధులను వాడుకుంటే సహించం
ప్రభుత్వ తీరు మారాలి
లేనిపక్షంలో కేంద్ర నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్ల లోకి
సిరిసిల్ల ఆంధ్రప్రభ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివ్రుద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్ధిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 105 కోట్లతో నిర్మించారు తలపెట్టిన చెరువు పునరుద్ధరణ తో పాటు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రం అభివ్రుద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
అమృత్ కింద భారీగా నిధులు

తెలంగాణ కు అమృత్ 1 కింద 1660 కోట్లు, అమృత్ 2 కింద 3వేల 429 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కరీంనగర్ పార్లమెంట్ లోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు అమ్రుత్ పథకం కింద దాదాపు 400 కోట్ల రూపాయలను కేటాయించింది. అందులో ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి 105 కోట్ల 57 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. కేంద్రం పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులిస్తోంది. 12 ఏళ్లలో 13 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయినా కేంద్రం ఏమిచ్చింది.తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలాడుతున్నారు . అసలు తెలంగాణలో అభివ్రుద్ది జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా నయాపైసా కూడా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదు. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నయాపైసా ఇయ్యలేదు. మోదీ ప్రభుత్వం వివిధ స్కీంల కింద నిధులు ఖర్చు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో పాటు పలువురు పాల్గొన్నారు.
