ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
- జేఏసీ నాయకులకు ఎమ్మెల్యే వసంత హామీ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రజాప్రతినిధులకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఏపీపీటీడీ ఇబ్రహీంపట్నం డిపో జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే వసంతను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అవసరమైతే ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల వద్దకు జేఏసీ నాయకులను స్వయంగా తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్, కార్మిక పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
