స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక
స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక
మోతె, (ఆంధ్రప్రభ): మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో స్వేరోస్ గ్రామ నూతన కమిటీని స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఎన్నుకున్నారు.
గ్రామ అధ్యక్షుడిగా నవిలే నరేష్, ప్రధాన కార్యదర్శిగా నవిలే నరేష్, ఉపాధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్, కోశాధికారిగా సైదులు, సోషల్ మీడియా ఇన్చార్జిలుగా మధు, విఘ్నేష్, జాయింట్ సెక్రటరీగా రవి, అడ్వైజర్‌గా గణేష్, కమిటీ సభ్యులుగా నరేష్, వీరబాబు, వినయ్, గణేష్, వినయ్ తదితరులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లపల్లి శివకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆలోచనల నుంచి పుట్టిన స్వేరోస్ నెట్వర్క్ “అక్షరం – ఆర్థికం – ఆరోగ్యం” అనే నినాదంతో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య ఆదేశాల మేరకు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన స్వేరోస్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికైన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వేరో సిద్ధాంతాలను పాటిస్తూ నెట్వర్క్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మోతె మండల నాయకుడు మేకల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
