సమ్మక్క–సారలమ్మలను దర్శించేకున్న ఎమ్మెల్యే వెడ్మా..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. గత ఎన్నికలకు ముందు చేసుకున్న మొక్కు మేరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు.

ప్రజలందరికీ సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.