Trip | సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పర్యటన ఫలితమే ఫోర్ లైన్ కు నిధులు..

Trip | సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పర్యటన ఫలితమే ఫోర్ లైన్ కు నిధులు..

కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

Trip | మక్తల్ , ఆంధ్రప్రభః సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 60 ,70 సార్లు వెళ్లిన ఢిల్లీ పర్యటనలు ఫలించాయని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. కేంద్ర మంత్రులను కలిసి పలుమార్లు రాష్ట్ర అభివృద్ధి పనులపై చేసిన విజ్ఞప్తుల మేరకు… కేంద్రం స్పందించి జడ్చర్ల గుడెబల్లూరు ఫోర్ లైన్ కు మూడు వేల కోట్లు కేటాయించిందని మంత్రి అన్నారు. నిధులు కెటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. జడ్చర్ల నుండి గుడెబల్లూర్ వరకు 3175 కోట్ల తో 4లేన్ ల రహదారి కి తనతోపాటు నారాయణపేట, దేవరకద్ర ,మహబూబ్ నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలు సంయుక్తంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి జాతీయ రహదారి ఫోర్ లైన్ విస్తరణ పనులపై వినతిపత్రం అందించామని, ‌ ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులను కలిసి ఈ ఫోర్ లైన్ పనులపై చర్చించారని అన్నారు.

ఆ సమయంలో కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని గుర్తు చేశారు. దాదాపు 70 సార్లు ఢిల్లీ పర్యటనకు తిరిగిన ఫలితమే ఫోర్ లైన్ జాతీయ రహదారికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతి పక్షాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 -70 సార్లు ఢిల్లీకి వెళ్లడం వలన ఫలితం ఏంటని విమర్శించారని, ఇప్పుడు జాతీయ రహదారికి నిధులు కేటాయించడం సీఎం రేవంత్ పర్యటన ఫలితమేనని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండే రోడ్డు పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని అన్నారు. తన 5 శాఖలకు సంబంధించి కూడా చాలా సార్లు కేంద్ర మంత్రులను కలిశానని, పెద్ద ఎత్తున తన శాఖలకు సైతం నిధులు వస్తున్నాయని మంత్రి తెలిపారు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడ్

(హ్యామ్) పద్దతిలో తీసుకోవడం వల్ల లాభమేంటని చాలా మంది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారని.. ఇప్పుడు హ్యామ్ ద్వారానే 4 లేన్ ల రోడ్డు మంజూరు చేశారని గుర్తు చేశారు. దీంతోపాటు నారాయణపేట మక్తల్ ఫోర్ లైన్ రోడ్డు సైతం హ్యమ్ పద్ధతిలోనే చేపడుతున్నామని అది కూడా త్వరలో ప్రారంభం కానుందని అన్నారు. మరో పక్క కృష్ణమ్మ పరవళ్లు,మక్తల్-నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందని, ఆ పథకానికి సైతం మక్తల్ పేరును జోడించాలని అడిగిన వెంటనే ఆ ప్రాజెక్టుకు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం గా సీఎం రేవంత్ రెడ్డి నామకరణం చేశారని తెలిపారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారని అన్నారు. అంతకుముందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్తల్ నియోజవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు మంత్రి వాకిటి శ్రీహరి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply