గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడంతో పాటు గ్రామాభివృద్ధి కార్యాచరణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం అన్నారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయ ఆదిత్య భవన్‌లో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశంతో పాటు మండలంలోని సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు, నిధుల సమర్థ వినియోగం, గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
