నేల ఆరోగ్యం పై అవగాహన…

నేల ఆరోగ్యం పై అవగాహన…

రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ

మునుగోడు, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి నివేదన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి రైతు వేదికలో నేల ఆరోగ్యం,నేల సంరక్షణ, మట్టి నమూనా విశ్లేషణ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు మట్టి నమూనాలను సేకరించే విధానం, పరీక్షల అవసరం గురించి అధికారులు వివరించారు. ఎరువుల సమతుల వినియోగం, నానో యూరియా ప్రయోజనాలపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.

గత నెలలో సేకరించిన మట్టి నమూనాల ఆధారంగా రూపొందించిన సాయిల్ హెల్త్ కార్డులను చల్మెడ సర్పంచ్ బండమీది యాదయ్య, కొంపల్లి సర్పంచ్ జీడిమడ్ల నిర్మల, ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధ్యమని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పాలకూరి యాదగిరి గౌడ్,ఎస్.కే. వాహీద్‌తో రైతులు పాల్గొన్నారు.