గోశాలలో గోవులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం..

గోశాలలో గోవులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం..

మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాలలో గల సుమారు 60 గోవులకు ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ పర్యవేక్షణలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడింది.

గోశాలలోని గోవులు ఆరోగ్యంగా ఉండి, అంటువ్యాధులు మరియు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు పశుసంవర్ధక శాఖ వైద్యుల సలహాల మేరకు వ్యాక్సిన్‌లు, అవసరమైన నివారణ మందులు అందజేయడం జరిగింది.

గోవుల ఆరోగ్య పరిరక్షణకు దేవస్థానం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ, నిరంతరం వైద్య పరీక్షలు, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ గోసంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు గారు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ (పశుసంవర్ధక శాఖ)  కోసూరు రవీంద్ర గారు మాట్లాడుతూ, దేవస్థాన గోశాలలోని ప్రతి గోవుకు సమయానుకూలంగా వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్, పోషకాహారం అందించి వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గోమాతల సంరక్షణను దేవస్థానం అత్యంత పవిత్రమైన బాధ్యతగా భావించి నిరంతరం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ (పశుసంవర్ధక శాఖ) కోసూరు రవీంద్ర, మోపిదేవి మండల వెటర్నరీ వైద్యాధికారి డా.నందకిషోర్, ఆలయ సూపర్డెంట్  అచ్యుత మధుసూదన్ రావు, వెటర్నరీ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొని గోవులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.