2:00 P.M. | 3 జూలై 2026 ముఖ్యాంశాలు
Rs-50000-Crore-Investment : 50 వేల కోట్లు పెట్టుబడి పెడ్తున్నాం
(ఆంధ్రప్రభ, కడప బ్యూరో ) : rs-50000-crore-investment : ఏడాదికి 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో నిర్మితం అవుతున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను మరింతగా విస్తరిస్తాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నా. లాంటి విజన్ ఉన్న నాయకులు దేశంలో చాలా అరుదుగా ఉన్నారు . click here to read full news
bhatti vikramarka | రూ.8.21 లక్షల కోట్ల అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలి
bhatti vikramarka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. click here to read full news
Cristiano Ronaldo | రిటైర్‌మెంట్ వార్తలకు రొనాల్డో ఫుల్‌స్టాప్.. ‘ప్రపంచకప్ తర్వాతే నిర్ణయం’
Cristiano Ronaldo | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో రిటైర్‌మెంట్‌పై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఆయన స్వయంగా తెరదించారు. ప్రపంచకప్ అనంతరం తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేస్తూ రిటైర్‌మెంట్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. click here to read full news
Telangana Politics | జూపల్లికి హరీశ్ ప్రతి సవాల్
Telangana Politics | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. జూపల్లి చేస్తున్న వ్యాఖ్యలు రోజుకో సవాల్, పూటకో మాట, రోజుకో అడ్రస్‌లా మారిపోయాయని విమర్శించిన ఆయన, సవాల్ చేసి చివరకు వెనక్కి తగ్గారని ఆరోపించారు. click here to read full news
Murder Case | కేతన్ అగర్వాల్ హత్య కేసు: వైరల్‌గా సియా గోయల్ పాత వీడియో..
Murder Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త పరిణామం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం కేసుపై మరోసారి చర్చకు దారితీసింది. click here to read full news
Gold Price | కొనుగోలుదారులకు షాక్!
Gold Price | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పసిడి, వెండి ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. వరుసగా రెండో రోజు భారీగా పెరగడంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న సామాన్యులకు గట్టి షాక్ తగిలింది. గత మూడు రోజుల పాటు స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు గురువారం నుంచి ఒక్కసారిగా రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. click here to read full news
Prashna-Ravan-Arrested : ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్..Andhra Prabha Crime News
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను మచిలీపట్నం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ నుంచి ఇనగుదురు పోలీసు స్టేషన్ రకు తరలించారు. ఈ సమాచారంతో పెద్ద సంఖ్యలో జససేన కార్యకర్తలు పోలీసు స్టేషన్ కు బయలు దేరారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనే స్థితిలో ఇనకుదురు స్టేషన్ సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. click here to read full news
AP News | చంద్రబాబుపై సజ్జల తీవ్ర విమర్శలు
AP News | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అమరావతి రాజధాని పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై తాము ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టినా, వాటిపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. click here to read full news
Telangana Debt Challenge | రాజీనామాకు సిద్ధం.. మంత్రి జూపల్లి
Telangana Debt Challenge | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. రాష్ట్ర అప్పుల లెక్కలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతుండగా.. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. click here to read full news
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
