కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
టీయుసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడుడి. వెంకట నాగరాజు
శ్రీకాళహస్తిలో పతాకావిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమం
కార్మిక సంఘాల ఐక్యతపై నాయకుల పిలుపు
ఆంధ్రప్రభ, విజయవాడ : ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టి యు సి సి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ సీడ్స్ వర్కర్స్ యూనియన్ (టీయూసీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీయూసీసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నాగరాజు పతాకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరల్డ్ ఫెడరేషన్ అఫ్ ట్రేడ్ యూనియన్స్ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న టి యు సి సి దేశంలో సుమారు 22 లక్షల సభ్యత్వంతో జాతీయ గుర్తింపు పొందిన కార్మిక సంఘమని పేర్కొన్నారు.
నేతాజీ సుభాషిచంద్ర బోస్ స్థాపించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కార వేదికగా పనిచేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పి.వి. సుందరరామరాజు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రామచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.వి. నరసింహమూర్తి, నాయకులు దొడ్ల గౌరీ, మునయ్య, ఏపీ సీడ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
