PM మోదీ 6 రోజుల విదేశీ పర్యటన

  • ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కీలక ద్వైపాక్షిక భేటీలు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుంచి విదేశీ పర్యటన చేప‌ట్ట‌నున్నారు. ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించి కీలక నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

పర్యటన షెడ్యూల్ ఇలా..

  • ఇండోనేషియా: జూలై 6 నుంచి 8 వరకు
  • ఆస్ట్రేలియా: జూలై 8 నుంచి 10 వరకు
  • న్యూజిలాండ్: జూలై 10 నుంచి 11 వరకు

ఇండో-పసిఫిక్‌పై ప్రత్యేక దృష్టి

ఈ పర్యటనలో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సముద్ర భద్రత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, కొత్త పెట్టుబడి అవకాశాలు సృష్టించడం, రక్షణ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై మూడు దేశాల నాయకులతో మోదీ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్‌కు ఈ దేశాలతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.