amaravati-only-capital : జనంతో ఆటలొద్దు Andhra Prabha Top News
amaravati-only-capital : జనంతో ఆటలొద్దు Andhra Prabha Top News
- అమరావతే రాజధాని
- ఎవ్వరూ మార్చలేరు
- హింస, నేరాలే లక్ష్యం
- రాయలసీమ రాళ్ల సీమ కాదు
- ఇక ఉక్కు సీమ
- ఇక్కడ సంపద ఇక్కేడే ఉంటుంది
- రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం
- సున్నపురాళ్లపల్లి సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
( ఆంధ్రప్రభ, కడప బ్యూరో )

ప్రస్తుతం నేరస్థులే రాజకీయాలు చేస్తున్నారు. హింస, నేరాలతో రాజకీయాలు చేయకూడదు. ప్రజల కోసం బాధ్యతగా చేయాలి. విజయవాడ యువకుడి అదృశ్యం ఘటనను కూడా రాజకీయం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. అని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నపురాళ్ల పల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం అనంతరం సీఎం మాట్లాడుతూ, విధ్వంసమే గొడ్డలి పార్టీకి అజెండా. వారికి విశ్వసనీయతే లేదు. అమరావతి రాజధానికి ఒప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడారు. నిన్న మావిగన్ అన్నారు. నేడు విజయవాడ అంటున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని చెబుతున్నాను గత పాలనలో మన రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి. మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని, ప్రజల్ని తీవ్రంగా నష్ట పరిచారు. ప్రజలంతా గర్వపడే విధంగా కాలరెత్తుకుని చెప్పే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. పోలీసులు ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తారు. ప్రజల శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తగా ఉంటారు గంజాయి బ్యాచ్ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించాను. మా హయాంలో శాంతిభద్రతలకే పెద్ద పీట వేశాం., అని సీఎం చంద్రబాబు వైసీపీని తూర్పారబట్టారు.
amaravati-only-capital : అన్నీ భ్రమలే

కొందరు స్వార్థపరులు గతంలో కేవలం సొంత ప్రయోజనాల కోసమే పనిచేసి అక్రమాలు చేశారు. 2007లో 14 వేల ఎకరాలను బ్రహ్మణీ స్టీల్స్ కు భూములు ఇచ్చి భ్రమలు కల్పించారు. ఎయిర్ పోర్టు కడతామని అన్నారు. ఇప్పటి వరకూ అదీ జరగలేదు. ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు. స్మగ్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. దేశానికి ఉపయోగపడాల్సిన సంపద విదేశాలకు తరలిపోయింది. తప్పు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లారు . రాయలసీమకు చెందిన సంపద ఈ ప్రాంతంలోనే ఉపయోగపడాలి. ఇక్కడి ముడి ఇనుముతో ఇక్కడే ఉక్కు తయారు అవ్వాలి. ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాంట్లతో స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడతాం, అని సీఎం హామీ ఇచ్చారు.
amaravati-only-capital : అవి మోసపూరిత శంకుస్థాపనలు

విభజన తర్వాత అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు దాటుకున రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. గత పాలకులు మోఇనంసపూరితంగా శంకుస్థాపనలు చేశారు. 2019లో ఓసారి, 2023లో మరోమారు శంకుస్థాపన, భూమి పూజలు చేశారు; ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. గడచిన రెండేళ్లలో చాలా అంశాల్ని పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం. 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవుతుంది. మొదటి దశలో రూ.4 వేల కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు . ఉక్కు రాష్ట్రం ఏపీ, విశాఖతో పాటు రాయలసీమ ఉక్కు సీమగా తయారవుతుంది స్టీల్ ప్లాంట్ తో పాటు సోలార్ ఎనర్జీ క్యాప్టివ్ ప్లాంట్ ను జేఎస్ డబ్ల్యూ ఏర్పాటు చేస్తోంది . పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో వ్యర్ధాల నుంచి వచ్చిన ఇనుము సేకరించి ఉక్కు ఉత్పత్తి చేస్తారు, అని సీఎం వివరించారు.
amaravati-only-capital : రాయలసీమలో ఇక నవశకం

రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం దశాబ్దకాలం పాటు ఎదురు చూశాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోంది. రాయలసీమ అంటే ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, సీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్- రాయల్ ఎన్ ఫీల్డ్, కియా కార్లు, హీరో బైక్ , డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ సీమ అంటే ఇకపై ఈ ప్రాంతం ఏమాత్రం కరువు నేల కాదు, జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతం . పరిశ్రమలు, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ఓ నవశకం మొదలైంది, అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
amaravati-only-capital : ఇక రాయలసీమ ఉక్కు సీమే

విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి రూ.11,440 కోట్ల ఆర్ధిక సాయం తెచ్చి కాపాడాం. నక్కపల్లిలోనూ ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. జేఎస్ డబ్ల్యూ కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారు. రాయలసీమ ప్లాంట్ బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్ధ్యంతో పనిచేయాలని జేఎస్ డబ్ల్యూను కోరుతున్నాను గండికోట నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీల నీటిని కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు అందిస్తాం. రాయలసీమ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా సరఫరా చేసేందుకు ఏపీ సిద్ధం రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఏర్పాటు చేస్తాం రాయలసీమకు ఎవరివల్ల నష్టం జరిగిందో ప్రజలు గమనించాలని కోరుతున్నాను. జేఎస్ డబ్ల్లూ ప్లాంట్ తో ఈ ప్రాంతంలో సామాజికంగా ఆర్ధికంగా ప్రభావం ఉంటుంది, అని సీఎం సీబీఎన్ స్పష్టం చేశారు.
amaravati-only-capital : పెట్టుబడులు వస్తున్నాయి

రూ.11 లక్షల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్రానికి చెందిన యువత మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉ1ద్యోగాలు కల్పిస్తాం ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కడప జిల్లాకు, రాయలసీమకు ఏమీ చేయలేదు. రెండేళ్లలో జేఎస్‌డబ్ల్యూను ఒప్పించి, అనుమతులు తెప్పించి స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం . వచ్చే రెండేళ్లలోనే ఈ పరిశ్రమలో ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుందని స్పష్టం చేస్తున్నా రెండేళ్ల తర్వాత మళ్లీ ఇదే సమయానికి వచ్చి ఈ ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తాం, అమెరికాలో ఉన్న గ్రాండ్ కాన్యాన్ కు ధీటుగా మన గండికోటను అభివృద్ధి చేస్తాం. నమ్మకంతో, విశ్వాసంతో పాలన అందిస్తున్నాం కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. హార్టికల్చర్ పంటలతో భూములకు మరింత విలువ పెరుగుతుంది. మన పల్లెలు సంపదకు కేంద్రం అవుతాయని సీఎం సీబీఎన్ స్పష్టం చేశారు.
amaravati-only-capital : ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు

గత పాలకులు రాయలసీమలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేక పోయారు.గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరలోనే ఇస్తాం. సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుస్తాం . అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులలో చీని తోటలు కూడా బ్రతికించాం, ఎర్రబెల్లి చెరువుకు నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాం . సీమలో స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్సు, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తాయి తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసే స్పేస్ సిటీలో, డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్ డబ్ల్యూ ముందుకు వచ్చింది. హార్టికల్చర్ కారణంగా ఇక్కడి లింగాల మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉంది ఆగస్టు 15 నాటికి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు మదనపల్లిలో శంకుస్థాపన చేస్తాం
ప్రభుత్వం తరపున రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూస్తాం, అని సీఎం వివరించారు.
