అవనిగడ్డలో ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి

రంగా చిత్రపటానికి నివాళులు.. విశేష స్పందనతో మెగా రక్తదాన శిబిరం

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: స్వర్గీయ వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీక్షేత్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగా చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, జనసేన నాయకుడు చిలకలపూడి పాపారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి భవిరి శంకర్‌నాథ్ శిబిరాన్ని పర్యవేక్షించారు.

వక్తలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన వంగవీటి మోహనరంగా సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన యాసం చిట్టిబాబును రాజకీయ ప్రముఖులు అభినందించారు.