shamshabad airport | 150మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

shamshabad airport | 150మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

shamshabad airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కలకలం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు బయలుదేరాల్సిన విమానంలో టేకాఫ్‌కు ముందు ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తింది.

విమానంలో అప్పటికే సుమారు 150 మంది ప్రయాణికులు ఎక్కిన తర్వాత, టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పైలట్లు, సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమాన ప్రయాణాన్ని నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎయిర్‌లైన్స్ సంస్థ హోటల్ బసతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేసింది. విమానంలోని సాంకేతిక లోపాన్ని ఇంజినీరింగ్ బృందం పరిశీలిస్తోంది.