వ్యర్థాలతో కలుషితం అవుతున్న మునేరు…
వ్యర్థాలతో కలుషితం అవుతున్న మునేరు…
నివారణ మార్గాలపై దృష్టి సారించిన అధికారులు..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : గ్రామంలోని డ్రైనేజీలో వస్తున్న మురికి నీరు స్థానిక మునేరులోకి చేరడం వల్ల మున్నేరు మొత్తం కలుషితం అవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో సుమారు పదివేలకు పైగా జనాభా ఉన్నారు వారి నివాసాలు వాడిన మురికి నీరు మొత్తం డ్రైనేజీల ద్వారా మునేరులో కలుస్తుంది అలాగే గ్రామంలో ప్రముఖ దేవాలయం ఉండడంతో నిత్యం వేలాదిమంది భక్తులు వస్తారు వారు వాడిన వ్యర్ధాలు సైతం మున్నేరులోనే పడి వేస్తున్నారు దీంతో ఆ పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు దుర్వాసన భరిస్తూ వ్యాధులకు గురవుతున్నారు. ప్రధానంగా మునేరు అవతల నున్న మామిడి తోటలు వ్యాపార స్థావరలుగా మారాయి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతినిత్యం వేలాదిమంది మామిడి తోటలోనే విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు అలాగే ఇక్కడ పదుల సంఖ్యలో ఉన్న కళ్యాణ మండపాలలో జరిగిన వేడుకల్లో మిగిలిన వ్యర్ధాలు మొత్తం స్థానిక మునేరులోనే గుట్టలగా పోస్తున్నారు. దీనివల్ల ఆ వ్యర్ధాలు మొత్తం కుళ్ళిపోయి మునేట్లో కలుస్తున్నాయి దీనివల్ల గ్రామానికి మంచినీటి సరఫరా చేసే బోర్లు సైతం అక్కడే ఉండడంతో తాగునీరు కలుషితం అవ్వటం వల్ల ప్రజల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివారణ మార్గాలపై దృష్టి సారించిన అధికారులు..
మున్నేరు మొత్తం కలుషితం అవుతున్న సంబంధిత అధికారులు నివారణ చర్యలు పై దృష్టి సారించట్లేదని స్థానికులు తెలుపుతున్నారు ప్రధానంగా మునేరు అవతల నున్న మామిడి తోటలోని వ్యర్థాలను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన మామిడి తోట నిర్వాకులు, వ్యాపారులు తోటలోని వ్యర్ధలను మున్నేరులో పారువేస్తున్నారని ఇప్పటికైనా వ్యర్ధాల తొలగింపు పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
