బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా..

బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణ శివారులో కల్లు సేవించిన అనంతరం మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం బోధన్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన విట్టల్ శుక్రవారం బోధన్ శివారులోని ఓ కల్లు దుకాణంలో కల్లు సేవిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేసి తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.