ఎస్‌ఐఆర్‌ ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలన..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ ఓటర్ నమోదు పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని చౌటుప్పల్ మండల తహసీల్దార్ వీరాభాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు. ​గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో.. మండల సర్వేయర్, ఎస్‌ఐఆర్‌ ఓటర్ నమోదు ఇంచార్జ్ ఎం. మురళీధరన్ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు జీపీఓ రాములు, శైలజ, నరసింహ, దశరథ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు, బీఎల్‌ఓ బొల్లు అండాలు, అంగన్‌వాడీ టీచర్ నల్ల జయప్రద కలిసి గ్రామ ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకుని, పత్రాలలో నమోదు చేశారు. మండల స్థాయి అధికారులు అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయానికి విచ్చేసి, సేకరించిన ఓటర్ నమోదు పత్రాలను ఆన్‌లైన్ చేయనున్నట్లు సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ తెలిపారు. గ్రామస్థులు ఎవరైనా ఇంకా ఓటర్ నమోదు చేసుకోని వారు ఉంటే.. తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యుల వివరాలు, సంబంధిత పత్రాలతో వచ్చి ఓటర్ గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.