5:00 P.M | 3 జూలై 2026 ముఖ్యాంశాలు

మంత్రులు సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు : వేముల ప్రశాంత్‌రెడ్డి..  

తెలంగాణ రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పనితీరుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ వాగ్వాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. Click Here To Read Full News

తెలంగాణలో హీటెక్కిన రాజ‌కీయం..

తెలంగాణ రాజకీయాల్లో ఈ వారం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సాధారణ ఆరోపణలు, ప్రత్యారోపణలు దాటి ఇప్పుడు చర్చ “సెల్ఫ్ గోల్” అనే పదం చుట్టూ తిరుగుతోంది. ఈ పదం కేవలం మీడియా హెడ్‌లైన్లలోనే కాదు, అధికార వర్గాల్లో కూడా అసౌకర్యాన్ని కలిగించినట్టు కనిపిస్తోంది. పలువురు విశ్లేషణల్లో వచ్చినట్లుగా “సెల్ఫ్ గోల్” అనే వ్యాఖ్యను ప్రస్తావిస్తూ వచ్చిన కథనాలు అధికార పక్షంలో చర్చకు దారి తీశాయి. Click Here To Read Full News

స్కూల్ బస్సులో మంటలు, విద్యార్థులు సురక్షితం..

మండలంలో సంతగుడిపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో ప్రమాదం తప్పింది. నరసరావుపేటకు చెందిన కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కర్లకుంట గ్రామానికి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తుండగా బస్సులోని ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. Click Here To Read Full News

నూతన సీఎస్‌ను కలిసిన టీజీవోస్ నేతలు..

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు, ఐఏఎస్‌ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. Click Here To Read Full News


ఆధారాలు ఉంటే బయటపెట్టాలి..

గురుకుల విద్యాసంస్థల టెండర్ల వ్యవహారం, గన్‌పార్క్ వద్ద జరిగిన రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన, ప్రభుత్వంపై ఆధారాలు లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. టెండర్ల విషయంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. Click Here To Read Full News

తిరుమలలో భక్తుల వెల్లువ..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండు రోజుల పాటు స్వల్పంగా తగ్గినట్లు కనిపించిన రద్దీ శుక్రవారం నుంచి మరోసారి ఊపందుకుంది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. Click Here To Read Full News

జనంతో ఆటలొద్దు..

ప్రస్తుతం నేరస్థులే రాజకీయాలు చేస్తున్నారు. హింస, నేరాలతో రాజకీయాలు చేయకూడదు. ప్రజల కోసం బాధ్యతగా చేయాలి. విజయవాడ యువకుడి అదృశ్యం ఘటనను కూడా రాజకీయం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. అని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. Click Here To Read Full News


ప‌ల్స్ పోలియో స‌క్సెస్‌…

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం ఘన విజయాన్ని నమోదు చేసింది. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 41,53,185 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ 101.4 శాతం కవరేజీ సాధించింది. ఈ విజయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేస్తూ కార్యక్రమం విజయవంతం చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు. Click Here To Read Full News

గాంధీభవన్ ఎదుట కాలే యాదయ్యకు వ్యతిరేకంగా నిరసన..

తెలంగాణలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బహిర్గతమైంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పాత కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమించిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. Click Here To Read Full News

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి..

అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి కంటే భారీ వ్యయాలు, అప్పులు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. Click Here To Read Full News

ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..

టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది నిజమే. అయితే దానిని తాగే విధానం, సమయం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే గుండెల్లో మంట, అసిడిటీ, నిద్రలేమి, ఐరన్ లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Click Here To Read Full News

బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డుతున్న‌ అల్పపీడనం..

వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. Click Here To Read Full News