- కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘనవిజయం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఐపీఎల్ 2025 సీజన్‌ను ఘన ప్రదర్శనతో ముగించింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 110 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్.. ఆరెంజ్ ఆర్మీ అభిమానులను ఆకట్టుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన SRH, తొలి నుంచి దూకుడుగా ఆడి 277 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. క్లాసెన్ (105) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (32), ఇషాన్ కిషన్ (29), అనికేత్ వర్మ (12) ఆకట్టుకున్నారు. ఫలితంగా 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగులు సాధించారు.
లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్.. ఆదినుంచే తడబాటుకు గురైంది. రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోతూ మరింత ఒత్తిడికి లోనయ్యింది. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాబ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబే మగ్గురూ మూడేసి వికెట్లు పడగొట్టారు.
సన్ రైజర్స్ ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో హైదరాబద్ ప్రదర్శన రాబోయే సీజన్‌కు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. మరోవైపు, కోల్‌కతా నిరాశతో వారి ప్రయాణాన్ని ముగించింది.