Accident | స్కూల్ బస్సులో మంటలు, విద్యార్థులు సురక్షితం
Accident | రొంపిచర్ల, ఆంధ్రప్రభ : మండలంలో సంతగుడిపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో ప్రమాదం తప్పింది. నరసరావుపేటకు చెందిన కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కర్లకుంట గ్రామానికి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తుండగా బస్సులోని ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, అందులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా కిందికి దించాడు. అనంతరం స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు
