ఘనంగా మెకానిక్ దినోత్సవం
చల్లపల్లిలో భారీ హెల్మెట్ ర్యాలీ నిర్వహించిన మెకానిక్ లు
చర్లపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని శుక్రవారం చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి టూ వీలర్స్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ ప్రాంతంలో మెకానిక్ దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్చేయగా, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎమ్మనేని నాని, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబులు మెకానిక్ దినోత్సవంలో పాల్గొని మెకానిక్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నబీఘోరి, జిల్లా అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు అంకాల సుబ్బారావు, కార్యదర్శి జానీ, చల్లపల్లి అధ్యక్షుడు కొల్లూరి ప్రేమ్చంద్, జిల్లాకమిటీ సభ్యుడు ఉస్మాన్ షరీఫ్ తదితరులు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
మెకానిక్ భారీ హెల్మెట్ ర్యాలీ
తొలుత హెల్మెట్ వాడకంపై వాహనదారుల్లో అవగాహన పెంపొందించేందుకు మెకానిక్లు చల్లపల్లి పురవీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాజిక బాధ్యతగా హెల్మెట్ వాడకం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ప్లకార్డులు తయారుచేసి ప్రదర్శించారు. చల్లపల్లి ఎస్ఐ డి. దుర్గాంజనేయులు ర్యాలీలో పాల్గొని మెకానిక్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, చల్లపల్లి మెకానిక్ లు పెద్దఎత్తున పాల్గొన్నారు.
