ఏజెన్సీస్ విత్తన షాపులోని రికార్డులు, విత్తనాలు సీజ్
- కేసముద్రం మండల వ్యవసాయ అధికారి వెంకన్న
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులోని రమ్య ఏజెన్సీస్ విత్తన షాపును జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఈ నెల 1న నరసింహుల గూడెం రైతు తేజావత్ అరుణ్ పాండ్యన్ కు హైబ్రిడ్ మొక్కజొన్న పయనీర్ కంపెనీకి చెందిన పి3302 రకం హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాన్నీ గడువు పూర్తి అయిన వాటిని సదరు డీలర్ విక్రయించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపులను తనిఖీ చేశారు. గడువు అయినటువంటి మూడు విత్తన ప్యాకెట్లను, షాపులో గుర్తించి అట్టి మొక్కజొన్న విత్తనాలతో పాటు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులను పంచనామ నిర్వహించరు. విత్తన చట్టం 1966 ప్రకారం సీజ్ చేయడం జరిగిందనీ , సీజ్ చేసినటువంటి, నివేదికను షాపు, విత్తన లైసెన్సు పై తగు చర్యల నిమిత్తం జిల్లా ఉన్నతా ధికారులకు పంపియడం జరిగిందనీ వెంకన్న తెలిపారు.
