ఆడబిడ్డ వివాహానికి అండగా ఈ ఎల్ వి ఫౌండేషన్..
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన ఏర్పుల అన్నయ్య–జయమ్మ దంపతుల కుమార్తె మానస వివాహానికి ఈ ఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ ఈ ఎల్ వి భాస్కర్ చేయూత అందించారు. గ్రామ మాజీ సర్పంచ్ జాజుల పారిజాత–సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయనను సంప్రదించగా రూ.30 వేల నగదు,ఒక పట్టు చీర,100 కిలోల బియ్యాన్ని అందజేశారు. దీంతో మానస తల్లిదండ్రులు భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆడపిల్ల వివాహానికి అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఈ ఎల్ వి భాస్కర్ సేవలను పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో శ్రీను, వినయ్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
