ఎస్ ఐఆర్ సవరణను సీరియస్‌గా తీసుకోవాలి..

  • మహాద్వార్ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి

మక్తల్, ఆంధ్రప్రభ : ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను గ్రామ ప్రజలందరూ అత్యంత బాధ్యతగా తీసుకుని ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని మహాద్వార్ గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలోని 6వ వార్డులో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)తో కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు తమ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు.

ఎవరైనా పేరు లేకపోయినా, తప్పులు ఉన్నా వెంటనే బీఎల్ఓ దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని ఆయన సూచించారు.ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి కుటుంబం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించి సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్న సీరియస్ గా తీసుకోవాలని సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమానికి జిపిఓ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి రాజేష్, బిఎల్ఓ ఇందిరమ్మ , వార్డు సభ్యులు డాక్టర్ ఆశప్ప ,బాట నరసింహ, ప్యాట ఎల్లప్ప ,వడ్ల నరేష్ చారి, ఎర్రం కొల్ల రాము, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.