ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ఏ పీ డి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని లత్తవరం తండాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వ్యక్తం కావడంతో, బుధవారం లత్తవరం తాండను ఏ పీ డి ఆయేషా సందర్శించారు. ఆర్ డి టి కమ్యూనిటీ హాల్ లో గ్రామస్తులతో ఉపాధి హామీ పనులపై విచారణ చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వ్యక్తిగత ఇంకుడు గుంతలలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి వారాలు గడుస్తున్న, ఇంతవరకు కూలీలకు బిల్లులు చెల్లించ లేదన్నారు.

దీనితో ఏ పీ డి అయేషా క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో లత్తవరం తండాలో 22 వ్యక్తిగత ఇంకుడు గుంతలు నిర్మాణ పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేశారన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణ పనులపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. అక్రమాల కు పాల్పడి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామ న్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుజాత, టెక్నికల్ అసిస్టెంట్లు సూర్యనారాయణ, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.