హ్యాండ్ బాల్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్

హ్యాండ్ బాల్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్

రాప్తాడు, ఆంధ్రప్రభ హ్యాండ్ బాల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికలు మరియు శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా క్రమశిక్షణతో నిర్వహించామని చిట్రా ఆదినారాయణ పేర్కొన్నారు.రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు గత వారం రోజులుగా హ్యాండ్ బాల్ జిల్లా జట్టు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా క్రీడాకారులకు టిడిపి రాప్తాడు ఇంచార్జి ధర్మవరపు మురళి చేతులు మీదగా క్రీడా దుస్తులు విడుదల చేశారు.

హ్యాండ్ బాల్ శిక్షణ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినందుకు ధర్మవరపు మురళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శిక్షణ పొందిన క్రీడాకారులు ఈ నెల 27,28,29 తేదీలో విజయనగరం జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.టిడిపి నాయకులు క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పంపు కొండప్ప మాజీ కన్వీనర్ నారాయణస్వామి కాంట్రాక్టర్ బైటీని ప్రసాద్ క్లస్టర్ ఇంచార్జిలు సోమర నారాయణస్వామి బోగినేపల్లి రాము ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య పాల్గొన్నారు.

Leave a Reply