పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు మండలంలో పదో తరగతి ఫలితాల్లో 557 మార్కులతో మొదటి స్థానం సాధించిన కొండ్లె సాయి చరణ్, 552 మార్కులతో రెండో స్థానం పొందిన పుప్పాల హాసినిని శాలువాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మహంకాళి బుచ్చయ్య, తొర్రూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జే. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.అనంతరం సంఘ సీనియర్ సభ్యుడు, విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమాన్ల కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, సమాజానికి అందించిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి, కార్యదర్శి యాకూబ్, గౌరవ అధ్యక్షుడు దేవుడి వెంకటరెడ్డి, కలకోట సోమయ్య, ఉపాధ్యక్షుడు పి. వినోద్ రెడ్డి, కాంతమ్మ, కార్యదర్శులు సీహెచ్ విజయ్ కుమార్, వెంకటనారాయణ, వీరభద్రయ్యతో పాటు సుమారు 40 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
