ఎంపీఎల్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

  • ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల శివారు ప్రాంతంలోని వట్టిమర్త గ్రామ పరిధిలో ఉన్న ఎంపీఎల్ పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న కాలుష్యం, నల్లని పొగ, బూడిద కారణంగా చిట్యాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల బీఆర్ఎస్ పట్టణ నాయకులు చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం, నల్లని పొగ, బూడిద వల్ల చిట్యాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, యువకులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మవ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు.

ఎంపీఎల్ పరిశ్రమపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు కూరెళ్ల లింగస్వామి, నిమ్మనగోటి శ్రీనివాస్, ఎస్.కె. ఆదిముద్దీన్, ఆగు అశోక్, కోనూరు శంకర్, ఉప్పలపల్లి నగేష్, జిట్ట కృష్ణ, మద్ది మధు, జంగీర్, సిలువేరు యశ్వంత్, జిట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.