చెన్నూరులో ఉచిత యోగ క్లాసులు ప్రారంభం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలోని మహేశ్వరి భవన్లో రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సత్వా నేచర్ క్యూర్ యోగా ఆయుర్వేద రిట్రీట్ శిక్షణ శిభీరాన్ని మున్సిపల్ చెర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్ ప్రారంభించారు. రాజస్థాని సమాజ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ లాహోటి,ఘన్ శ్యామ్ లు మాట్లాడుతూ రాజస్థాని సమాజ్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ తరుగతులు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
