16 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు!

16 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు!

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2010 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 16 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకేచోట కలుసుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో బాల్య స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.

ఈ సందర్భంగా వారు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను, ఉపాధ్యాయుల బోధనలను, సహచర విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ తమ ప్రస్తుత జీవిత ప్రయాణాలను పరస్పరం పంచుకున్నారు. చదువు పూర్తి చేసుకుని విడిపోయిన తాము, ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడి మళ్లీ ఇన్నాళ్లకు ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పాత స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply