Hyderabad vs development | హైదరాబాద్ మారుతోంది.. కానీ సమస్యలు…?
Hyderabad vs development | హైదరాబాద్ మారుతోంది.. కానీ సమస్యలు…?
Hyderabad vs development | అభివృద్ధి మధ్య పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ
రోడ్ల దుస్థితి, గుంతలతో వాహనదారుల ఇబ్బందులు
డ్రైనేజ్ వైఫల్యం, వరద సమస్యలతో ప్రజల ఆగ్రహం
తాగునీటి సరఫరా లోపాలతో కాలనీవాసుల ఆందోళన
కాలుష్యం పెరుగుదలపై నిపుణుల హెచ్చరికలు
జీవన నాణ్యత మెరుగుపరచాలని ప్రజల డిమాండ్
Hyderabad vs development | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆధునిక రూపాన్ని సంతరించుకుంటున్నప్పటికీ, ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు మాత్రం ఇంకా పరిష్కార దిశగా పూర్తిగా వెళ్లలేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ రంగం విస్తరణ, మెట్రో రైలు నెట్‌వర్క్ అభివృద్ధి, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి అనేక ప్రాజెక్టులతో నగరం రూపురేఖలు మారుతున్నాయి. అయితే.. ఈ అభివృద్ధి మధ్యలోనే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా కార్యాలయ సమయాల్లో ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంటోంది. రోడ్ల విస్తరణ జరిగినా, వాహనాల సంఖ్య వేగంగా పెరగడంతో ట్రాఫిక్ జామ్‌లు తగ్గకపోగా కొన్ని ప్రాంతాల్లో మరింత పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Hyderabad vs development | ట్రాఫిక్ రద్దీ..

కార్యాలయకు వెళ్లే సమయాల్లో ప్రధాన రహదారులు, ఐటీ కారిడార్ ప్రాంతాలు (హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్) తీవ్ర ట్రాఫిక్‌తో నిండిపోతాయి. వాహనాల సంఖ్య వేగంగా పెరగడం వల్ల ట్రాపిక్ జామ్‌లు సాధారణమైపోయాయి. దీని పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైరనా ఉంది. మెట్రో వచ్చినా.. ఇంకా ట్రాఫిక్ తగ్గడం లేదు. ఏం చేస్తే.. ట్రాఫిక్ తగ్గుతుంది అనేది ప్రభుత్వమే కాదు.. ప్రజలు కూడా ఆలోచించాలి.
Hyderabad vs development | రోడ్ల పరిస్థితి & గుంతలు

కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోవడం, వర్షాకాలంలో గుంతలు ఏర్పడటం వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది. కొన్ని కాలనీల్లో వాహనాలు వెళ్లలేని స్థితి కూడా ఏర్పడుతోంది. ఇంకా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు అలాగే ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనులు ఒకవైపు వేగంగా జరుగుతున్నా, రోజువారీ జీవనానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు మాత్రం అంత వేగంగా మెరుగుపడడం లేదని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు.
Hyderabad vs development | డ్రైనేజ్ & వరద సమస్య

వర్షాలు పడినప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల రహదారులు, చెరువుల్లా మారుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరం అంతర్జాతీయ స్థాయి వైపు దూసుకెళ్తున్నప్పటికీ, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జనాలు చెబుతున్నారు. అభివృద్ధి కేవలం నిర్మాణాల్లో కాకుండా, జీవన నాణ్యతలో కూడా కనిపించాలని వారు కోరుతున్నారు.
Hyderabad vs development | నీటి సరఫరా సమస్యలు

కొన్ని కాలనీల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలి.
Hyderabad vs development | కాలుష్యం..

వాహనాల పొగ, నిర్మాణ పనుల దుమ్ము వల్ల గాలి కాలుష్యం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం కూడా అధికంగా ఉంది. వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. పాత వాహనాలను తీసేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవే కాకుండా.. రవాణా, ఇంటి అద్దెలు, రియల్ ఎస్టేట్ ఇలా సమస్యలు పెరుగుతున్నాయి కానీ.. తగ్గడం లేదు. నగరం మారుతోంది.. కానీ సమస్యలు తీరడం లేదు ఇంకా పెరుగుతున్నాయని ప్రజల గళం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రభుత్వం.. నగరాన్ని అభివృద్ది చేయాలని.. దేశంలో నెంబర్ 1 ప్లేస్ లో నిలబెట్టాలి.. అంతర్జాతీయంగా మరింత పేరు తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేయడం బాగానే ఉంది కానీ.. సామాన్యుల జీవన విధానం మారేలా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉంది అంటున్నారు.
