జూబ్లీహిల్స్ లో.. ఇదే తొలిసారి..
జూబ్లీహిల్స్ లో.. ఇదే తొలిసారి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేస్తున్నారు. ఇంత మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే.. ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరిగా జరిగింది. ఇప్పుడు ఎన్నికల బరిలో 58 మంది ఉండడంతో ఒక్కో బూత్ లో మొత్తం నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కరెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని ఈరోజు పంపిణి చేయనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా అన్నింటిలో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్నారు.
226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బలగాలను మోహరించారు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే పారా మిలటరీ దళాలను రంగంలోకి దింపి బందోబస్తుకు ఆదేశించారు. విధుల్లో మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బంది ఉండనున్నారు. జీహెచ్ఎంసీ ఆపీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసేవరకు నిజయోకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ ను పటిష్టంగా పోలీసు శాఖ అమలు చేస్తుంది.
