Etala Rajender | సర్పంచులు లేక స్మశానాలుగా గ్రామాలు..

Etala Rajender | సర్పంచులు లేక స్మశానాలుగా గ్రామాలు..

సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు ఉండదు
నాయకుల మధ్య విభేదాలు మీడియా సృష్టి
ఎంపీ ఈటల రాజేందర్


Etala Rajender | కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటి పోయిన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించక పోవడం సిగ్గుచేటు అన్నారు పోవడం సిగ్గుచేటు అన్నారు. గ్రామాల్లో బల్బులు పెట్టే వాళ్ళు లేరు, మురికి కాలువలు సాఫ్ చేసేవారులేరన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకునే నాధులే లేడని, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఫర్ క్యాపిటా నిధులు ఎన్నికలు జరగకుంటే రావన్నారు. అవి వస్తేనే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని, రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదు…


సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch election) పార్టీ గుర్తులు ఉండవని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మరోసారి మోసగించేందుకు 42 పర్సెంట్ రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తామని చెబుతుందన్నారు. అసలు గుర్తులేలేని ఎన్నికలకు పార్టీ పరంగా ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని నిలదీశారు. గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ఎన్నుకుంటారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించడానికి బీజేపీ నాయకుడిగా నా ప్రయత్నం చేస్తున్నామన్నారు. బిల్లులు రాక సర్పంచులు ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు.

నాయకుల మధ్య విభేదాలు మీడియా సృష్టి…


మా నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కొన్ని ఛానెల్స్, యూ ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా (Social media) సృష్టిస్తుందన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేమంతా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నామన్నారు. కొన్ని మీడియా ఛానల్లు తమ రేటింగ్ పెంచుకునేందుకు తమ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రసారం చేయడం సరికాదన్నారు.