Mosquito Coil Ban | ఆ బ్రాండ్ అస్సలు వాడొద్దు.. అధికారుల హెచ్చరిక

Mosquito Coil Ban | ఆ బ్రాండ్ అస్సలు వాడొద్దు.. అధికారుల హెచ్చరిక

Mosquito Coil Ban | కొన్ని బ్రాండ్లపై ఎందుకు చర్యలు?
విజయవాడలోనూ భారీగా నిల్వలు స్వాధీనం
ఈ పొగ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?
కొనేటప్పుడు ఇవి తప్పక చూడండి
వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
అసలు నిజం ఇదే

Mosquito Coil Ban | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ఈ వర్షకాలంలో రాత్రి వేళ దోమలతో దండయాత్రే చేస్తుంటాం. దోమల భారీ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా వరకు అందురూ.. ఇళ్లలో మస్కిటో అగరబత్తులు, కాయిల్స్‌ను వాడుతుంటాం. అయితే కొన్ని దోమల అగరబత్తుల్లో అనుమతి లేని రసాయనాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం నిషేధించిందంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం సాగుతుంది. దీంతో మార్కెట్‌లో లభించే అన్ని మస్కిటో అగరబత్తులు ప్రమాదకరమా? దేశవ్యాప్తంగా వాటిని నిషేధించారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నిజంగానే మస్కిటో అగరబత్తలు బ్యాన్ చేశారా ? అనే విషయాన్నీ తెలుసుకుందాం..

Mosquito Coil Ban | కొన్ని బ్రాండ్లపై ఎందుకు చర్యలు?

మహారాష్ట్రలో ‘కంఫర్ట్‌’, ‘స్లీప్‌వెల్‌’ పేర్లతో విక్రయిస్తున్న కొన్ని మస్కిటో అగరబత్తుల్లో అనుమతి లేని రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు కథనాలు గతంలో వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయడం, నిల్వలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ చర్యలను దేశంలోని అన్ని బ్రాండ్లపై విధించిన నిషేధం కాదు. ప్రతి ఉత్పత్తికి తయారీ, నమోదు, అందులో ఉపయోగించిన రసాయనాలు, లేబుల్‌పై ఇచ్చిన వివరాల ఆధారంగానే అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

Mosquito Coil Ban | విజయవాడలోనూ భారీగా నిల్వలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనూ దోమల అగరబత్తుల నిల్వలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ‘స్లీప్‌వెల్‌’ పేరుతో విక్రయిస్తున్న సుమారు రూ.69.24 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు కథనాలు వెలువడ్డాయి. ప్రయోగశాల పరీక్షల్లో నమోదు పొందని పురుగుమందు రసాయనం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. తయారీదారు వివరాలు, నమోదు సంఖ్య, రసాయనాల సమాచారం లేకుండా ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.

Mosquito Coil Ban

Mosquito Coil Ban | ఈ పొగ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

మస్కిటో కాయిల్స్‌, అగరబత్తులు వెలిగించినప్పుడు పొగతో పాటు సూక్ష్మ ధూళికణాలు, కొన్ని రసాయన వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. గాలి సరిగా రాని మూసివేసిన గదుల్లో వీటిని ఎక్కువసేపు వెలిగిస్తే కళ్ల మంట, గొంతు చికాకు, దగ్గు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కొందరిలో కనిపించే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చిన్నపిల్లలు, వృద్ధులు, ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ పొగకు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల కాయిల్‌ లేదా అగరబత్తిని మూసివేసిన గదిలో రాత్రంతా వెలిగించి ఉంచకుండా జాగ్రత్త పడటం మంచిది. అయితే ఒక్కసారికే తీవ్రమైన వ్యాధి వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఉత్పత్తి నాణ్యత, గదిలో గాలి ప్రసరణ, వినియోగ సమయం, పొగకు ఎంత తరచుగా గురవుతున్నారనే అంశాలపై దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది.

Mosquito Coil Ban

Mosquito Coil Ban | కొనేటప్పుడు ఇవి తప్పక చూడండి..

మస్కిటో అగరబత్తులు, కాయిల్స్‌ లేదా ఇతర దోమల నివారణ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు ప్యాక్‌పై తయారీదారుడి పేరు, చిరునామా, తయారీ తేదీ, గడువు తేదీ, నమోదు సంఖ్య, పదార్థాల వివరాలు, ఉపయోగించే విధానం, హెచ్చరికలు ఉన్నాయో లేదో పరిశీలించాలి.

లేబుల్‌ లేని ఉత్పత్తులు, తయారీదారు వివరాలు స్పష్టంగా లేని వస్తువులు, అసాధారణంగా తక్కువ ధరకు అమ్మే అనుమానాస్పద ఉత్పత్తులను కొనకుండా ఉండటం మంచిది. ‘పూర్తిగా సహజసిద్ధమైనది’ లేదా ‘హెర్బల్‌’ అని రాసి ఉన్నా పదార్థాల వివరాలను పరిశీలించాలి.

Mosquito Coil Ban | వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..

కాయిల్‌ లేదా అగరబత్తి వెలిగించినప్పుడు గదిలో కొంత గాలి ప్రసరణ ఉండేలా చూడాలి. మంచం, పరదాలు, కాగితాలు, పిల్లల చేతికి అందే ప్రదేశాల దగ్గర ఉంచకూడదు. దగ్గు, కళ్ల మంట, తలనొప్పి లేదా శ్వాస ఇబ్బంది కనిపిస్తే వెంటనే ఆర్పి స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశానికి వెళ్లాలి. దోమల నివారణ కోసం పొగ వచ్చే ఉత్పత్తులపైనే ఆధారపడకుండా దోమతెరలు ఉపయోగించడం, కిటికీలకు మెష్‌ ఏర్పాటు చేయడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, నీటి పాత్రలను మూతపెట్టడం వంటి చర్యలు తీసుకోవాలి.

Mosquito Coil Ban

Mosquito Coil Ban | అసలు నిజం ఇదే..

దేశంలోని అన్ని మస్కిటో అగరబత్తులపై ప్రభుత్వం నిషేధం విధించలేదు. అనుమతి లేని లేదా నమోదు పొందని పురుగుమందు రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన కొన్ని ఉత్పత్తులపైనే అధికారులు చర్యలు చేపట్టారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మి భయపడకుండా, సరైన లేబుల్‌, తయారీదారు వివరాలు, నమోదు సమాచారం ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. పొగ వచ్చే కాయిల్స్‌, అగరబత్తులను గాలి రాని గదుల్లో ఎక్కువసేపు ఉపయోగించకుండా జాగ్రత్తలు పాటించాలి

CLICK HERE TO READ 5 alternatives | గ్యాస్ సిలిండర్ లేకుండా.. నగరాల్లో నయా ట్రెండ్

CLICK HERE TO READ MORE

Leave a Reply