Nitish Kumar Reddy | ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో అమ్మ ఫోన్.. వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy | ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో అమ్మ ఫోన్.. వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మైదానంలో తన ఆటతీరుతో ఆకట్టుకునే యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, మైదానం బయట తన సింప్లిసిటీతో మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భారత్-అఫ్ఘానిస్తాన్ మధ్య ధర్మశాలలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి మొబైల్ ఫోన్‌కు కాల్ వచ్చింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గుర్తించిన నితీష్, ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కాసేపు నిలిపివేసి ఫోన్ అటెండ్ చేశాడు. తల్లితో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం మళ్లీ మీడియా సమావేశాన్ని కొనసాగించాడు.
ఈ ఘటన అక్కడున్న మీడియా ప్రతినిధులతో పాటు అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ తల్లి ఫోన్‌కు వెంటనే స్పందించడం నితీష్ కుటుంబ విలువలను ప్రతిబింబిస్తోందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. “అమ్మ అంటే అమ్మే”, “స్టార్ క్రికెటర్ అయినా తల్లి పిలుపుకు వెంటనే స్పందించాడు” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నితీష్ ప్రవర్తనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
