Encounter | ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ఎన్ కౌంటర్ – ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం

ఛత్తీస్ ఘడ్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కొండగావ్..నారాయణ్ పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించడంతో కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్యనా ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే అందులో ఇద్దరినీ మాత్రం పోలీసులు మట్టుబెట్టారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలను, ఏకే 47 తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన వారు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పేర్లు ఇంకా ఏంటన్నది మాత్రం తెలియలేదు

అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ పి.సుందరరాజ్ తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున అంబాగఢ్ చౌకీ జిల్లాలో 5 లక్షల రివార్డు ఉన్న ఒక నక్సలైట్ భద్రతా దళాల ముందు లొంగిపోయాడు. 34 ఏళ్ల రూపేష్ మాండవి అలియాస్ సుఖ్‌దేవ్ జిల్లాలోని సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *