ఆషాఢ మాసంలో పోచమ్మ ఆలయానికి భక్తుల రద్దీ

మొక్కులు చెల్లించిన భక్తులు.. ప్రత్యేక పూజలు

చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మధునపు పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆషాఢ మాసంలో పోచమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో పూజించి మొక్కులు చెల్లిస్తే కుటుంబాలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉంటాయనే విశ్వాసంతో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.