సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ రాజేష్

ఓటీపీ, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచన

నిజాంపేట, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు.

ఆన్‌లైన్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు లేదా 100కు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లో సైబర్ మోసాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, ఏఈఓ శ్రీలత, రమ్య, సర్పంచులు భానుప్రకాశ్ రెడ్డి, బొమ్మన మల్లేశం, నరేందర్, సుశీల, ఆకుల స్వప్న రమేష్, ఉప సర్పంచులు ఆకుల మహేందర్, దేవరాజ్, అనిల్, గెరిగంటి బాబు, సూర రాములు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.