అన్నదానానికి రూ. లక్ష విరాళం..

  • దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కు చెక్కు అందజేసిన దాతలు

( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి విజయవాడ మొగల్రాజపురానికి చెందిన సాయి సుమ–హేమచంద్ర దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందజేశారు. దేవస్థాన కార్యాలయంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)ను మర్యాదపూర్వకంగా కలిసి రూ.1 లక్ష చెక్కును భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా దాతల సేవాభావాన్ని చైర్మన్ గాంధీ అభినందిస్తూ, అన్నదాన కార్యక్రమానికి అందించే ప్రతి విరాళం వేలాది మంది భక్తులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం దాతలకు దేవస్థానం తరఫున అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయక, ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.