వైభవంగా లలితా సహస్రనామ పారాయణం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో పురుషోత్తమ (అధిక) మాసాన్ని పురస్కరించుకుని శనివారం ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
లోక కల్యాణం కోసం, దేశం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో స్వామివారికి, అమ్మవారికి అధిక మాస వాయినాలు, ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ పూజారులు పెద్ది కృష్ణ కిషోర్ శర్మ, రోహిత్ మిశ్రా వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వుప్పల కుసుమ, దీపిక, సింగిరికొండ శైలజ, దాచేపల్లి నాగమణి, రమాదేవి, లక్ష్మీ, యమున, ప్రసన్న, తెలుకుంట్ల వసంత, బూరుగు నాగరాణి, కామిశెట్టి శ్రీదేవి, సముద్రాల పుష్పమ్మ, వాణి, వనపర్తి పావని, నీలా పద్మ, ఉష, పెద్ది స్వాతి తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
