దళిత రత్న అవార్డు గ్రహీత మావలే దత్త మాంగ్ కు సన్మానం

జైనూర్, ఆంధ్రప్రభ : జైనూర్ చెందిన మాంగ్ సమాజ్ సంఘం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎన్ హెచ్ ఆర్ సి ఆసిఫాబాద్ జిల్లా వైస్ చైర్మన్ మావలే దత్త మాంగ్ కు ఇటీవల దళిత రత్న అవార్డు రావడంతో జైనూర్ లో శనివారం మాంగ్ సమాజ్ అశ్వ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ కాంబ్లే, నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మంచి సేవలు అందించినందుకు ప్రభుత్వ పరంగా దళిత రత్న అవార్డు రావడంతో పాటు ఎన్ హెచ్ ఆర్ సి లో అసిఫాబాద్ జిల్లా వైస్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఇలాగే మంచి సేవలందించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రియాజ్, సయ్యద్ అబ్రార్, షేక్ లి యాజ్, గిత్తే ఉద్ధవ్ పాల్గొన్నారు.