మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే దివంగత కొత్తకోట దయాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమనిఅభిమానులు మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నరసింహ గౌడ్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మూడో వర్ధంతి పురస్కరించుకొని అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దయాకర్ రెడ్డి చేసిన సేవలు మరువలేని అన్నారు. పిలిస్తే పలికే పేదల పెన్నిధిగా అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరితే నేనున్నానంటూ బాధ్యతలను పరామర్శిస్తూ వారికి ఆర్థిక సహాయంచేశారనిగుర్తు చేశారు.
టిడిపి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్న దయాకర్ రెడ్డిలేనిలోటుతీరనిదనివిచారం వ్యక్తంచేశారు. ఆత్మకూర్, దేవరకద్ర, మక్తల్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి వెంకటప్ప, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
