భక్తుల భద్రతకు ప్రత్యేక పహారా..
భక్తుల భద్రతకు ప్రత్యేక పహారా..
మామిడి తోట నిర్వాహకులకు నోటీసులు…..
నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. ఎస్సై అర్జున్
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో గత ఆదివారం భక్తుల పై దాడికి దిగిన దుండగులపై నందిగామ ఏసిపి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై అర్జున్ భక్తుల రక్షణ కొరకు ప్రైవేట్ గార్డెన్స్ లో కూడా ప్రత్యేక సిబ్బంది నియమించి రక్షణ చర్యలు చేపట్టారు.
శుక్రవారం ఆదివారం ప్రతేక సిబ్బంది…….
తిరుపతమ్మ ఆలయానికి శుక్ర, ఆదివారాల్లో వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారు. వీరిలో కనీసం ఆ రెండు రోజుల్లో ఐదారు వేల మందికి పైగా మేకపోతులు, కోళ్లను తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం ఆలయం. పక్కనే ఉన్న మునేరుకు ఆనుకుని ఉన్న ప్రైవేటు మామిడి తోటల్లో భక్తులు బస చేస్తున్నారు. అక్కడే మేకలు, కోళ్లను.. చేయించుకుని, వండించుకుని తింటున్నారు.దీనికోసం ఈ ప్రైవేటు గార్డెన్స్ లో టెంట్లు, వంట పాత్రలు, గ్యాస్ సహా పొయ్యి, కట్టెలు అన్నీ అద్దెకు ఇస్తున్నారు. వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా శుక్ర, ఆదివారాల్లో వచ్చి ఈ ప్రైవేటు తోటల్లో బస చేస్తు న్నారు, మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉంటున్నారు.వారి భద్రత కోసం ప్రతేక సిబ్బంది ని ఏర్పాటు చేశారు.

భక్తుల నుండి అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు…..
స్థానికంగా ఉండే కొంతమంది ఈ ప్రైవేటు గార్డెన్స్ లో భక్తులకు సంబంధించిన మేకలను కోసి, ముక్కలుగా చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఒక్కో మేకను ముక్కలు చేసేందుకు రూ.600 తీసుకుంటున్నారు. దీనితోపాటు భక్తుల కన్నుగప్పి కొంత మాంసం మాయం చేస్తున్నారు. ఈ సమయంలో భక్తులు ఇదేంటని అడిగితే తిరిగి వారి పైనే దాడులకు తెగబడుతున్నారు అని ఆరోపణలు బలంగా రావడంతో మాంసం కోసేవారిని తోట యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్ పిలిపించి భక్తులు వద్ద నుండి ధరలు అధికంగా వసూలు చేసిన మాంసం నరికే సమయంలో దొంగతనానికి పాల్పడిన తోట యజమాని బాధ్యతగా ఉండాలని లేకుంటే మాంసం దొంగలించిన వ్యక్తితో పాటు తోట యజమాని పై కూడా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ముఖ్యంగా తమ తోటల్లో భక్తులకు వారు అందించే సౌకర్యాలకు సంబంధించిన ధరలు పట్టికను ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. మామిడి తోటలు బయట ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా మాసం విక్రయాలు కూడా చేయకూడదన్నారు.
మామిడి తోట యజమానులకు నిర్వాహకులకు నోటీసులు……
తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలు….
తోట ప్రాంగణాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తుల పూర్తి వివరాలు, ఆధార్ నంబర్, చిరునామా, మొబైల్ నంబర్ ఫోటో గుర్తింపు వివరాలు నమోదు చేసి భద్రపరచాలి కార్యక్రమం నిర్వహించే తేదీ, సమయం, అంచనా జనసంఖ్య, వాహనాల సంఖ్య కార్యక్రమ స్వరూపం గురించి ముందస్తు సమాచారం నమోదు చేయాలి.కార్యక్రమంలో ఉపయోగించే మైక్ సెట్ సౌండ్ సిస్టం యజమాని వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.డీజేలు అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే సౌండ్ సిస్టమ్స్, లేజర్ షోలు ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్ద పరికరాలు కొన్ని (పోలీసు వారి విధించే) పరిమితులకు లోబడి అనుమతించబడును.. మత, కుల, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే పాటలు, డైలాగులు, ప్రసంగాలు డీజేలు ద్వారా ప్రచారం చేయకూడదు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదు.కార్యక్రమ ప్రాంగణంలో మద్యం సేవించడం, విక్రయించడం, నిల్వ చేయడం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధించబడినది.జూదం, పేకాట, బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలు లేదా చట్టవిరుద్ధ సమావేశాలు నిర్వహించినచో కఠిన చర్యలు తీసుకోబడతాయి, కేసులు నమోదు చేయబడతాయి. నిర్ణయించిన సమయం దాటిన తరువాత కార్యక్రమాలు నిర్వహించరాదు.వాహనాల పార్కింగ్ వల్ల ప్రజలకు, రహదారి రాకపోకలకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలి శాంతిభద్రతలకు భంగం కలిగే ఏ చర్యనైనా వెంటనే నిలిపివేయుటకు పోలీసులకు పూర్తి అధికారం ఉంటుంది.
కఠిన హెచ్చరిక…..
పై నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో తోట యజమానులు / లీజుదారులు, కార్యక్రమ నిర్వాహకులు, మైక్ సెట్ / సౌండ్ సిస్టం యజమానులు సంబంధిత వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత ( బి ఎన్ ఎస్ ), ఎన్ డి పి ఎస్ యాక్ట్ , ఎక్ససిస్ యాక్ట్ , నాయిస్ పొల్యూషన్ రూల్స్ ఇతర వర్తించే చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయబడును.అవసరమైతే కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయడం, సౌండ్ సిస్టమ్స్ స్వాధీనం చేసుకోవడం, ప్రాంగణాన్ని సీజ్ చేయడం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగును.ఈ ప్రాంగణాలు పూర్తిగా కమర్షియల్ ప్రాతిపదికన అద్దెకు ఇవ్వబడుతున్నందున, చట్టపరంగా పబ్లిక్ ప్లేస్లుగా పరిగణించబడతాయి. అందువల్ల ప్రాంగణంలో జరిగే ప్రతి కార్యకలాపానికి తోట యజమాని / లీజుదారుడు కార్యక్రమ నిర్వాహకులు సంయుక్త బాధ్యత వహించవలెను. “తెలియదు”, “మాకు సమాచారం లేదు”, “మేము కేవలం అద్దెకు ఇచ్చాము” అనే కారణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత నుండి మినహాయింపుగా పరిగణించబడవు. అని హెచ్చరించారు.
